రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
భువనగిరి : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి మాధవిలత అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. డ్రైవింగ్ చేసి వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం చట్టరీత్యా నేరమన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయ సేవాధికార సంస్థఽ ఆధ్వర్యంలో న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అనతరం రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ అసిస్టెంట్ హర్షవర్థన్‌రెడ్డి, ప్రిన్సిపల్ రాధిక తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత


