నిధులొస్తేనే ఊరట..
కొంత మేరకైనా అభివృద్ధి చేయొచ్చు
గ్రామ పంచాయతీలను ప్రస్తుతం నిధులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం (ఎఫ్‌ఎఫ్‌సీ), రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ), నిధులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో పంచాయతీల ఖజానాల్లో నిధులు లేకపోడంతో అనేక సమస్యలు తిష్టవేశాయి. తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణకు సైతం పంచాయతీ కార్యదర్శులు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ట్రాక్టర్ల నిర్వహణ పూర్తిగా లోపించింది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండేది. ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించలేని, డీజిల్ సైతం కొనలేని పరిస్థితి నెలకొంది.
ఆలేరురూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో పాటు సీఎం ప్రకటించిన ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాల్లో కొంతవరకు మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కలగనుంది.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం లభిస్తుందనే అభిప్రాయం నూతన పాలకవర్గాల్లో వ్యక్తమవుతోంది.
చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు,
పెద్దవాటికి రూ.10 లక్షలు
మేజర్ పంచాయతీకి రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌ఎఫ్‌డీ) కింద అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 24 ప్రకటించారు. యాదాద్రి జిల్లాలో 427 పంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రాలు 17 ఉండగా వీటికి రూ.10 లక్షల చొప్పున రూ.1.70 కోట్లు నిధులు విడుదలయ్యే అవకాశముంది. మిగతా 410 గ్రామ పంచాయతీలు చిన్నవి. ఇందులో ఆరు పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డవే.
చిన్న పంచాయతీల పరిస్థితి దయనీయం
చిన్న పంచాయతీలకు ఎలాంటి ఆదాయం వనరులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దుస్థితి. స్పెషల్ ఫండ్ కింద వీటికి రూ. 5లక్షలు చొప్పున ఇస్తామనే సీఎం ప్రకటనతో అక్కడి పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వీటికి గాను జిల్లా వ్యాప్తంగా రూ.20.50 కోట్లు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పంచాయతీలకు అదనపు ఆర్థిక భరోసా కలిగి సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులు కూడా విడుదలయ్యేలా చూడాలని పాలకవర్గాలు కోరతున్నాయి.
ప్రభుత్వం స్పెషల్ ఫండ్ కింద పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ నిధులు వస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. మరికొన్ని నిధులు మంజూరు చేస్తే నూతన పాకలవర్గాలకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది.
–ఇందూరి యాదిరెడ్డి, గొలనుకొండ సర్పంచ్
ఫ గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి
ఫ ‘ఎస్‌డీఎఫ్’పై ముఖ్యమంత్రి ప్రకటనతో నూతన పాలకవర్గాల హర్షం
ఫ జిల్లాలో 427 పంచాయతీలకు ప్రయోజనం
ప్రభుత్వం ముంజూరు చేయనున్న రూ.5 లక్షలతో గ్రామాల్లో కొంత మేరకు మౌలిక వసతులు కల్పించుకోవచ్చు. ఇంకా మరిన్ని నిధులు మంజూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజలు మమ్ముల్ని గెలిపించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.
–పసుల సతీష్‌రెడ్డి, మంతపురి సర్పంచ్
నిధులొస్తేనే ఊరట..
నిధులొస్తేనే ఊరట..


