టెండర్లు వాయిదా
చౌటుప్పల్ : మండల పరిధిలోని దండుమల్కాపురం శివారులో గల శ్రీఆంథోళ్ మైసమ్మ దేవాలయంలో సోమవారం నిర్వహించిన టెండర్లు వాయిదా పడ్డాయి. కిరాణం, జనరల్, సీసీ కెమెరాల నిర్వహణ, పూలు, కొబ్బరి చిప్పల కోసం టెండర్లు నిర్వహించారు.భక్తులు కొట్టిన కొబ్బరి కాయల చిప్పలకు, పూల విక్రయాలకు గతంలో ఎప్పుడూ టెండర్లు లేవని, కొత్త విధానం తీసుకువచ్చి తమ జీవనోపాధి దెబ్బతీయొద్దని కుమ్మరులు టెండర్లను అడ్డుకున్నారు. కొత్త సంప్రదాయానికి తెరలేపడం సరికాదని వాపోయారు. ఈ క్రమంలో గ్రామస్తులు, ఆలయ ఈఓ, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుని ఉద్రిక్తతకు దారి తీయడంతో టెండర్ల ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడగా తాజాగా మరోమారు వాయిదా వేశారు.
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రద్దు చేయబడిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో సహస్రనామార్చన చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపించిన అర్చకులు, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణాన్ని నేత్రపర్వంగా చేపట్టారు. వీటితో పాటు బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవోత్సవం తదితర పూజలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఎస్పీని కలిసిన బీజేపీ నాయకులు
భువనగిరి : జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్‌యాదవ్‌ను సోమవారం బీజేపీ నాయకులు కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అచ్చయ్య, చందా మహేందర్‌గుప్తా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, నాయకులు మేడి కోటేష్, రామకృష్ణ, మంగ నరసింహరావు, రత్నపురం బలరాం, శ్రవణ్‌కుమార్, ఉడుత భాస్కర్, కృష్ణాచారి, రమేష్, నాగరాజు, మల్లికార్జున్, జనగాం నర్సింహచారి, రాము పాల్గొన్నారు.
స్వర్ణగిరీశుడికి తిరువీధి సేవోత్సవం
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో సోమవారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవ సేవోత్సవం వైభవంగా చేపట్టారు. స్వామివారిని దివ్యమనోహరంగా అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, సహస్రనామార్చన, స్వామివారికి నిత్యకల్యాణం తదితర వేడుకలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తరద్వారం ద్వారా శ్రీస్వామి వారిని శ్రీరంగం పాండరీపురం అశ్రమ హెచ్‌హెచ్ శ్రీపరవకోటై శ్రీమత్ చిన్న అండవన్ స్వామి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టెండర్లు వాయిదా
టెండర్లు వాయిదా


