39 ఏళ్ల తరువాత ఒక్కచోటుకు..
పెద్దవూర: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 1986–87లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం ఒకే వేదికపైకి చేరారు. 39 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత పెద్దవూర సర్పంచ్ ఐతగోని వెంకటయ్య, కూర్నాల శ్రీనివాస్, పీఎల్‌ఎన్ శర్మ, శ్రీనవాస్‌శర్మ, సంజీవ, వెంకటయ్య, రవీందర్‌రెడ్డి, దేవదాసు, సంజీవ్‌కుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీదేవి, నీలమ్మ, జయమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.


