పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో నిలుస్తారు
గరిడేపల్లి: ప్రజల కోసం పనిచేసే నాయకులు చనిపోయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారని సీపీఐ జాతీయ నాయకుడు, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో సీపీఐ నాయకుడు పోటు ప్రసాద్ స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కమ్యూనిజం లేకుండా చేస్తామని మోదీ, అమిత్‌షా అంటున్నారని, కమ్యూనిజాన్ని అంతమొందించడం అంత సులువు కాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వెనుజులా దేశంపై అమెరికా చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, దండి సురేష్, రాజేశ్వరరావు, గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు, గన్న చంద్రశేఖర్, ధనుంజయనాయుడు, రాములు, నారాయణరెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, సృజన, కంబాల శ్రీనివాస్, నంద్యాల రామ్‌రెడ్డి, సాయిబెల్లి, కళావతి, బాబు, కడియాల అప్పయ్య, సర్పంచ్‌లు కట్ట కళ్యాణి, పద్మ, పూర్ణచంద్రరావు, పున్నయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.


