
కూలిన రైస్ మిల్లు గోడ
బొమ్మలరామారం : ట్రాక్టర్‌కు ఆఫ్ వీల్స్ బిగిస్తుండగా పక్కనే ఉన్న రైస్ మిల్లు గోడ కూలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడి నుంచి పక్కకు జరగగా.. ట్రాక్టర్ నుజ్జునుజ్జు అయింది. బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామానికి చెందిన ఎడిజర్ల బాలకృష్ణ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి గంగరబోయిన కృష్ణ పొలాన్ని శుక్రవారం దున్నడానికి వెళ్లాడు. గంగరబోయిన కృష్ణ పొలం పక్కనే రైస్‌మిల్ ఉంది. ట్రాక్టర్ దుక్కి దున్నడానికి ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ, కృష్ణ కొడుకు ఉపేందర్‌లు ఆఫ్ వీల్స్ బిగిస్తుండగా.. చేస్తుండగా రైస్ మిల్లు గోడ కూలింది. క్షణాల్లో తేరుకున్న ఇద్దరు యువకులు అక్కడి నుంచి పక్కకు జరగడంతో ప్రాణాపాయం తప్పింది. గోడ కూలడంతో ట్రాక్టర్ ధ్వంసమైంది. నెల రోజుల క్రితమే తెచ్చుకున్న కొత్త ట్రాక్టర్ గోడకూలి ధ్వంసం కావడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
● ధ్వంసమైన ట్రాక్టర్ ● తృటిలో తప్పించుకున్న ఇద్దరు యువకులు