
కష్టాలు కనండి.. దారి చూపండి
చౌటుప్పల్ రూరల్: మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చౌటుప్పల్ మండలం నేలపట్ల – వర్కట్‌పల్లి గ్రామాల మధ్య ఈదుల వాగుపై కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శనివారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ నేతృత్వంలో పార్టీ బృందం కల్వర్టు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఈదుల వాగుపై కల్వర్టు గతంలోనే దెబ్బతిందని.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిందన్నారు. వానాకాలానికి ముందే మరమ్మతులు చేసి ఉంటే కారు కొట్టుకుపోయేది కాదన్నారు. మునుగోడు, భువనగిరి నియోజకవర్గాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాగీరు కిష్టయ్య, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు తడకమోహన్, యనమల సంజీవ, దబ్బటి బక్కయ్య, మాజీ ఎంపీటీసీ బత్తుల శంకర్, బుట్టి కృష్ణ, గుర్రం కృష్ణ, డీవైఎఫ్‌ఐ నాయకులు బత్తుల వేణు, ఇట్టగోని మల్లేశం, దబ్బటి భాను, యనమల్ల నవీన్ పాల్గొన్నారు.
ఫ ఈదుల వాగుపై కొట్టుకుపోయిన రోడ్డు
ఫ రాకపోకలు బంద్
ఫ పరిశీలించిన సీపీఎం బృందం