
వెంబడించి.. దొంగలను పట్టుకొని..
మద్దిరాల: మహిళ మెడలో పుస్తెలతాడు అపహరించి పారిపోతున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను సోమవారం మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామ శివారులో యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మద్దిరాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్‌కుమార్, శుభంకుమార్ కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మాటేడు గ్రామానికి చెందిన ముత్యం ప్రేమలీల మెడలో సోమవారం పుస్తెలతాడును అపహరించి బైక్‌పై దంతాలపల్లి మీదుగా సూర్యాపేట జిల్లా మద్దిరాల వైపు రాగా.. దంతాలపల్లి పోలీసుల సమాచారం మేరకు మద్దిరాల పోలీసులు మద్దిరాల మండల కేంద్రంలోని కనకదుర్గ హోటల్ వద్ద వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దొంగలు బైక్‌ను రోడ్డు పైనే వదిలేసి చెల్కలల్ల మీదుగా పోలుమల్ల వైపు వెళ్తుండగా.. పోలీసుల సమాచారం మేరకు రెండు గ్రామాల యువకులు దొంగలను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగలు ఉపయోగించిన బైక్ కూడా ఖమ్మంలో అపహరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దొంగలను తొర్రూర్ పోలీసులకు అప్పజెప్పినట్లు మద్దిరాల ఎస్‌ఐ ఎం. వీరన్న తెలిపారు.
యువకులను అభినందించిన ఎస్‌ఐ
దొంగలను పట్టుకున్న మద్దిరాల, పోలుమల్ల గ్రామాల యువకులను ఎస్‌ఐ ఎం. వీరన్న పోలీస్ స్టేషన్‌లో అభినందించారు.
పోలీసులకు అప్పగించిన యువకులు

వెంబడించి.. దొంగలను పట్టుకొని..