
రహదారులపై వాహనాల బారులు
చౌటుప్పల్, భువనగిరి టౌన్ : రాఖీ పండుగ సందర్భంగా రోడ్లన్నీ రద్దీగా మారాయి. జాతీయ రహదారులు, పల్లె రూట్‌లు.. ఎటు చూ సినా వాహనాలతో నిండిపోయాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం మొదలైన రద్దీ శనివారం రెండింతలు పెరిగింది. చౌటుప్పల్ పట్టణంలో హైవేపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. దీంతో వాహనదారులు సర్వీస్ రోడ్ల గుండా వెళ్లడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఉదయం 11గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి సర్వీస్ రోడ్లపైకి వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్, తంగడపల్లి, వలిగొండ రోడ్లు, తంగడపల్లి చౌరస్తా జంక్షన్‌ను శుక్రవారం రోజునే మూసేశారు. వాహనదారులు, స్థానికులు వలిగొండ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించారు.
అర్ధరాత్రి వరకు రద్దీ
జనాలతో చౌటుప్పల్, భువనగిరి బస్టాండ్‌లు కిటకిటలాడాయి. చాలా మంది సాయంత్రం తిరుగుపయనం కావడంతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. ఏ బస్సు చూసినా సామర్థ్యానికి మించి ప్రయాణికులతో కనిపించాయి.

రహదారులపై వాహనాల బారులు

రహదారులపై వాహనాల బారులు

రహదారులపై వాహనాల బారులు