
ఎకరానికి ఒక్కటే బస్తా..
అంచనా మేరకు
వినియోగం జరగలేదు
సీజన్ ప్రారంభంలో వ్యవసాయ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం యూరియా కోటా కేటాయించలేదు. వచ్చిన యూరియాలో కూడా జూన్, జూలై మాసాల్లో అంచనా మేరకు వినియోగం జరగలేదు. జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా.. 52 శాతానికి మించలేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు విస్తీర్ణం పడిపోయి యూరి యా వినియోగంపై ప్రభావం పడిందని అధికారులు భావిస్తున్నారు. పరిమితంగా పంపిణీ చేయడంతో రైతుల ముందస్తు నిల్వ లకు బ్రేక్ పడి యూరియా కొరత రాకపోవడానికి కారణమని చెబుతున్నారు.
ఆలేరు: యూరియా కొరత తలెత్తకుండా వ్యవసాయ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అందుబాటులో ఉన్న నిల్వలను పరిమితంగా పంపిణీ చేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగా ఎకరానికి ఒక బస్తా, అది పూర్తిగా వాడితేనే మరొక బస్తా ఇస్తున్నారు. ప్రస్తుతం 4,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా.. వర్షాలు కురుస్తుండటంతో మరో 1,500 మెట్రిక్ టన్నులకు ఇండెంట్ పెట్టారు.
ముందస్తు జాగ్రత్తగా..
ఇతర జిల్లాల్లో యూరియా కొరత తలెత్తడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్య రాకుండా జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించారు. గతంలో ఎకరాలతో నిమిత్తం లేకుండా రైతులు అడిగినంత యూరియా పంపిణీ చేసేవారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పరిమితంగా యూరియా పంపిణీ చేయాలని నిర్ణయించారు. సాగు విస్తీర్ణం ప్రకారం ఫర్టిలైజర్ దుకాణాలు, పీఏసీఎస్, డీసీఎంఎస్, అగ్రో రైతుసేవా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా ఇస్తున్నారు. అది కూడా రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉందని పట్టాదార్ పుస్తకం పరిశీలించి యూరియా పంపిణీ చేస్తున్నారు. అవసరం లేకపోయినా రైతులు ముందస్తుగా ఎక్కువ యూరియా తీసుకెళ్లి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నందున, పాస్‌పుస్తకంలో నమోదైన ఎకరాల ప్రకారం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా కొరతకు చెక్‌పెట్టారు.
సగం కోటానే వచ్చినా కొరత లేకుండా..
వానాకాలం సీజన్‌కు మొత్తం 32,830 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇందులో ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు నెలలు పంటల సాగుకు కీలకం. ఈ మూడు నెలలకే 27,900 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాధికారుల అంచనా. ఇప్పటి వరకు 15,500మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే జిల్లాకు వచ్చింది. అందులో 11వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 4,100 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
12 బస్తాలు ఇచ్చారు
12ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి రెండు చొప్పున 24 బస్తాల యూరియా అవసరం ఉంది. ఇప్పటి వరకు 12 బస్తాలే ఇచ్చారు. తీసుకున్న యూరియా పూర్తిగా వాడిన తరువాత మళ్లీ ఇస్తామంటున్నారు. గతంలో ఎంతంటే అంత ఇచ్చేవారు. ఇప్పుడు పరిమితంగా యూరియా పంపిణీ చేస్తున్నారు.
–ఎడపల్లి కనకరాజు, రైతు, తుర్కపల్లి
పరిమితంగా యూరియా పంపిణీ
ఫ పాస్‌బుక్ ఆధారంగా ఇస్తున్న డీలర్లు
ఫ పూర్తిగా వాడితేనే మరొక బస్తా..
ఫ కొరత ఏర్పడకుండా కార్యాచరణ
ఫ అందుబాటులో 15,500 మెట్రిక్ టన్నుల యూరియా
ఫ ప్రణాళిక ప్రకారం పంపిణీ
యూరియా కొరత లేదు
జిల్లాలో యూరియా కొరత లేదు. 234 ఫర్టిలైజర్ డీలర్లు, 35 పీఏసీఎస్, 8 రైతు సేవా కేంద్రాలు, 2డీసీఎంఎస్ కేంద్రాల్లో ప్రస్తుతం 4,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నాం. అవసరం మేరకు రైతులు మళ్లీ కావాలంటే ఇస్తున్నాం. ఇందుకోసం 1,500 మెట్రిక్‌టన్నుల యూరియా కోసం కలెక్టర్ ద్వారా ప్రతిపాదన చేశాం. ఈనెల మధ్య వరకు వరినాట్లు వేసుకునే అవకాశం ఉన్నందున సాగు విస్తీర్ణం మరికొంత పెరుగుతుంది. –పీవీ.రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

ఎకరానికి ఒక్కటే బస్తా..

ఎకరానికి ఒక్కటే బస్తా..