
వన మహోత్సవం ఉద్యమంలా నిర్వహిద్దాం
నల్లగొండ టూటౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (ఎన్‌ఎస్‌పీసీ) 2025 హరిత్ ద వే ఆఫ్ లైఫ్ పోస్టర్‌ను శుక్రవారం ఎంజీ యూనివర్సిటీలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యా శాఖ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ పర్యావరణ విద్యా విధానంలో భాగంగా సామాజిక ఉద్యమం మాదిరిగా వన మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విద్యార్థుల చేత మొక్కలు నాటించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ఆకుల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి. ఉపేందర్‌రెడ్డి, అధ్యాపకులు హైమావతి, డాక్టర్ శ్రీనివాస్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
జాతీయ కాన్ఫరెన్స్ కరపత్రాల ఆవిష్కరణ
నల్లగొండ టూటౌన్: గణితశాస్త్రం దాని అనువర్తనాలపై వచ్చే నెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ కాన్ఫరెన్స్ కరపత్రాలను శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సెమినార్లు, సదస్సులు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన పెరుగుతుందన్నారు. రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడుతూ జాతీయ సెమినార్‌కు కావాల్సిన ఏర్పాట్లలో యూనివర్సిటీ తరపున అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ గణిత విభాగ అధిపతి, మద్దిలేటి పసుపుల, బోర్డాఫ్ స్టడీస్ చైర్ పర్సన్ డాక్టర్ జి. ఉపేందర్‌రెడ్డి, అధ్యాపకురాలు హైమావతి, శ్రీనివాస్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్