
పీహెచ్‌సీ భవన నిర్మాణ పనుల పరిశీలన
బీబీనగర్: స్థానిక నూతన పీహెచ్‌సీ భవనంలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని త్వరలో భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందు రహీంఖాన్‌గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అలాగే మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో మూసీ నది గుండా ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. వంతెలనపై నుంచి వరద నీరు ప్రవహిస్తే రాకపోకలను స్తంభింపజేసేలా చర్యలు తీసుకోవాలని పలు వాగుల వద్ద నీటి ఉధృతి ఉంటే ప్రజలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఎర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఏంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తహసీల్దార్ కార్యాలయం సందర్శన
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై సమీక్షా నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన వాటిని త్వరగా పరిష్కరించాలని అన్నారు. పోచంపల్లిలో భూభారతిలో చాలా వరకు ప్రభుత్వ, భూదాన్, వక్త్ఫ్, పెద్దచెరువులో మునిగిన భూములకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి ఉన్నారు.