భర్తను వదిలేసి రావాలన్న తల్లిదండ్రులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..! | - | Sakshi
Sakshi News home page

భర్తను వదిలేసి రావాలన్న తల్లిదండ్రులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..!

Nov 14 2023 1:50 AM | Updated on Nov 14 2023 12:09 PM

- - Sakshi

భూదాన్‌పోచంపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నర్సింహ, చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తె కప్పెర సంతోష(18)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

కాగా సంతోష తల్లి మల్లమ్మకు ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే విషయమై సంతోష తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండేవారు. అంతేకాక కుమార్తె సంతోషకు తల్లి మల్లమ్మ ప్రతి రోజూ ఫోన్‌ చేసి భర్తను వదిలేసి వస్తే మంచి సంబంధం చూసి తిరిగి పెళ్లి చేస్తానని చెప్పేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష సోమవారం భర్త నర్సింహ బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement