ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ ఉపాధి పొందుతున్నాం. నేటికీ పింఛన్ రావడంలేదు. అధికారులు ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులను గుర్తించి పింఛన్ అందిస్తే మా కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది.
– జెల్ల భాగ్య, బీడీ కార్మికురాలు, బేగంపేట
ఎన్నో సంవత్సరాల నుంచి బీడీలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాం. పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. నా భర్త తాటిచెట్టుపై నుంచి కింద పడి మంచాన పడ్డాడు. మాలాంటి పేద కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఎంతో అవసరం. నిబంధనలు సడలించి మాకు న్యాయం చేయాలి.
– లలిత, బీడీ కార్మికురాలు, సింగారం


