ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

Aug 25 2026 1:39 AM | Updated on Aug 25 2026 1:39 AM

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

ముసునూరు : ముసునూరులోని గోర్మేట్‌ పాప్‌ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మా ర్పు చేయని (నాన్‌–జీఎంఓ) మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ విచ్చేశారు. ఆయన కార్నికా సంస్థను సందర్శించి మొక్కజొన్న వంగడాల అభివృద్ధి, విత్తనాల ఉత్పత్తి, పరిశోధన, నా ణ్యతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. విత్తనాల విభాగంతో పాటు పరిశోధనశాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పరిశోధనా కార్యక్రమాలను ఆసక్తిగా పరిశీలించారు. సంస్థ ఎండీ ఎస్‌పీపీ పట్టాభిరామారావు సంస్థ కార్యకలాపాలను వివరించారు.

ఘన స్వాగతం

ముందుగా ముసునూరు చేరుకున్న ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, మంత్రులు ఎర్రన్నాయుడు, లోకేష్‌, కొలుసు పార్థసారథి, ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. జ్ఞాపిక బహూకరణ

మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ వేదికపై ఉప రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ సమేత జ్ఞాపికను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement