నరసాపురం : పేరుపాలెం బీచ్ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లూఫ్లాగ్ గుర్తింపు కోసం గతంలో సాగిన ప్రయత్నాలు నిలిచిపోగా, అభివృద్ధి పనులు ముందుకు పడటం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏకై క బీచ్ పేరుపాలెం. ఏటా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తూ రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీచ్, పర్యాటక అభివృద్ధికి అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి
● 2020 ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేరుపాలెంలో మూడు రోజులపాటు బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
● బీచ్‌కు అనుసంధానంగా రూ.4.5 కోట్ల వ్య యంతో రహదారి నిర్మాణాలను గత ప్రభు త్వం పూర్తి చేసింది.
● రూ.కోటి వ్యయంతో వైఎస్సార్ స్మృతి వనం, మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు.
● ప్రైవేట్ భాగస్వామ్యం రూ.40 కోట్ల వ్యయంతో రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు.
ప్రస్తుత పరిస్థితి.. డిమాండ్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా బీచ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంపై స్థానికులు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2021లో బ్లూ ఫ్లాగ్ బృందం పరిశీలన జరిపినా, ఆ గుర్తింపు సాధించే ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పేరుపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పేరుపాలెం బీచ్ అభివృద్ధిపై నీలినీడలు
కూటమి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడని వైనం
బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపైనా నిర్లక్ష్యం
బీచ్ అభివృద్ధిపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ


