కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, దేవస్థానం అద్దె గదులు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, విరాళాల ద్వారా రూ.52,511 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు చెప్పారు.


