భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులను స్వీకరించిన అనంతరం ఫోన్‌లో సంబంధిత పో లీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వ ర్సిటీ (వెంకటామన్నగూడెం) వీసీ డాక్టర్ కె.ధనుంజయరావుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీ విత సాఫల్య పురస్కారం లభించింది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. వ్యవ సాయ, ఉద్యాన రంగ అభివృద్ధి, విద్యా, పరిశోధన రంగాలకు రైతు సంక్షేమానికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. వేము సాహితీ సేవా సంస్థ రజతోత్సవాలను పురస్కరించుకుని ఈ అవార్డును గజల్ శ్రీనివాసు చేతుల మీదుగా అందించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో 2,174.675 చదరపు కిలోమీటర్ల పరిధిలో భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (భీమా ఉడా)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు, భీమవరం మున్సిపాలిటీలు, 19 మండలాల పరిధిలోని 282 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. భీమవరంలో ప్రధాన కార్యాలయం ఉంటుంది.
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఈనెల 26 నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినా థరావు తెలిపారు. ఉత్సవాలను ఈనెల 29 వరకు అత్యంత వైభవంగా జరుపుతామన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలను జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఆలయ అర్చకులు 26న అంకురార్పణతో ఉ త్సవాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. అ లాగే 27న పవిత్రాధివాసం, 28న పవిత్రావరోహణ, ఉత్సవాల్లో ఆఖరి రోజైన 29న ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయన్నారు. ఈ నా లుగు రోజులు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఈఓ తెలిపారు.
ఆగిరిపల్లి: రాజధాని అమరావతి పేరుతో దొ డ్డిదారిన గ్రావెల్‌ను అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మండలంలోని ఈదులగూడెం, కల్లుటూరు తాడేపల్లి, చొప్పరమెట్ల సరిహద్దులో ఉన్న కొండ పోరంబోకు గట్టుపై వారం రోజులుగా ఎల్‌అండ్‌టీ సంస్థకు అనుమతులు ఉన్నాయంటూ గ్రావెల్ తవ్వ కాలు చేస్తున్నారు. అయితే గ్రావెల్‌ను అమరావతికి తరలించకుండా లారీల్లో వందలాది ట్రి ప్పులను సూరంపల్లి సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


