సాక్షి, భీమవరం: డీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలకు జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. అధిక సంఖ్యలో పార్టీ నేతలు, డీఎస్సీ బాదిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. స్పోర్ట్స్ కోటా పేరిట అర్హులకు అన్యాయం చేయడాన్ని తీవ్రంగా విమర్శిం చారు. బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో మంగళవారం నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీజీసీ సభ్యుడు పీడీ రాజు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు ఆధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సమావేశంలో పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు వేండ్ర వెంకటస్వామి, ఏఎస్ రాజు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లూరి రవికుమార్‌రాజు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ, జిల్లా యూత్ అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ పాల్గొన్నారు. పాలకొల్లులో నియోజకవర్గ కోఆర్డినేటర్ గుడాల శ్రీహరిగోపాలరావు అధ్యక్షతన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, డీఎంఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, కుమార దత్తాత్రేయవర్మ, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రా జయచరిత పాల్గొన్నారు. ఉండిలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మంతెన యోగీంద్రబాబు అధ్యక్షతన పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో జరిగిన సమావేశంలో ఎస్‌ఈసీ సభ్యుడు పాతపాటి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్ పాల్గొన్నారు. కాగా సోమవారం తాడేపల్లిగూడెంలోని రేణుక ఫంక్షన్ హాలులో నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు అధ్యక్షతన, ఆచంట నియోజకవర్గం నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన తూర్పుపాలెంలో సమావేశాలు జరిగాయి.
డీఎస్సీ అక్రమాలపై జనగళం
సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే
మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్
వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలకు జిల్లాలో అనూహ్య స్పందన
హాజరైన అభ్యర్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత


