ఉద్యోగాలను అమ్ముకున్నారు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలను అమ్ముకున్నారు

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

ఉద్యోగాలను అమ్ముకున్నారు ఉద్యమం తీవ్రతరం నయవంచనతో పాలన ప్రభుత్వంలో కదలిక లేదు లోకేష్‌ రాజీనామా చేయాలి రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి, ఉద్యోగాలు ఇచ్చి మెరిట్‌ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. స్పోర్ట్స్‌ కోటా అంటూ వింత జీఓలు తీసుకువచ్చి ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారు. అక్రమాలకు పాల్పడిన లోకేష్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రికి పట్టిన గతే పడుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్‌సీపీ తరుఫున నిరంతరం పోరాటం చేస్తాం. దీనిలో భాగంగానే 6 నుంచి నాలుగు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపడతాం. 10న భారీ ర్యాలీ నిర్వహిస్తాం. పార్టీ నేతలు, నిరుద్యోగులు, యువత పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి.

– చినమిల్లి వెంకటరాయుడు, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను గాలికొదిలేసి నయవంచనతో పాలన సాగిస్తోంది. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసింది. కూటమి మోసాలను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసు జులుం ప్రదర్శించి అక్రమ కేసులు బనాయించి అణగదొక్కాలని చూస్తోంది. కూటమి ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా వెనక్కి తగ్గేది లేదు.

– గూడూరి ఉమాబాల, నరసాపురం పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌

డీఎస్సీలో జరిగిన అక్రమాలపై దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులు పోరాటాలు చేసినా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో ప్రభుత్వం మెడలు వంచి అభ్యర్థులకు న్యాయం చేకూర్చడానికి వైఎస్సార్‌సీపీ ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో జంతర్‌మంతర్‌ మాదిరిగానే ఉద్యమం తీవ్రతరం చేస్తాం.

– కవురు శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ

డీఎస్సీలో అక్రమాల ద్వారా అర్హులకు అన్యాయం చేసిన మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి. అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అభ్యర్థులు రోడ్డెక్కుతున్నా కనీసం వారితో మాట్లాడేందుకు కూడా కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. వారి పక్షాన పోరాడుతుంది.

– గుడాల గోపి, పాలకొల్లు కోఆర్డినేటర్‌

చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది. ప్రభుత్వ అణిచివేత ధోరణికి జడిసి తమకు జరిగిన అన్యాయంపై అభ్యర్థులు రోడ్డెక్కలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి న్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ కృషిచేస్తుంది. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆందోళనలు విజయవంతం కావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం.

– మంతెన యోగీంద్రకుమార్‌, ఉండి కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement