● పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటన
● జగన్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో దేవరపల్లిలోని కరటూరి కల్యాణ మండపంలో మంగళవారం ముందస్తు ఏర్పాట్లపై నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకుడు జెట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు, నౌడు వెంకటరమణ పాల్గొని ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ నాయకులు బీవీఆర్ చౌదరి, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, ఓరుగంటి నాగేంద్ర కుమార్, కర్పూరం గవరయ్య గుప్తా, కుర్రు రవి, కనికళ్ళ ప్రసాద్‌లతో పాటు రైతు నాయకులు వామిశెట్టి హరిబాబు, అట్లూరి సతీష్, గంటికోటి సత్తిబాబు, జుంగ బాబ్జి, నేకూరి కిషోర్, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


