చలో విజయవాడ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

చలో విజయవాడ పోస్టర్‌ ఆవిష్కరణ

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

చలో విజయవాడ పోస్టర్‌ ఆవిష్కరణ టెట్‌ పరీక్షల ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ‘మిస్టర్‌ ఆంధ్ర’గా చింతలపూడి యువకుడు కొల్లేరులో చేపల సాగు భేష్‌ తగ్గుతున్న గోదావరి వరద

భీమవరం: విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యుత్‌ ఉద్యోగుల స్ట్రగుల్‌ కమిటీ చైర్మన్‌, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ కోరారు. చలో విజయవాడ కార్యక్రమ ప్రచారంలో భాగంగా మంగళవారం భీమవరం ప్రాంతంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ శాఖ కార్యాలయాల వద్ద ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. విద్యుత్‌ శాఖలో సుమారు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ సబ్‌స్టేషన్లు, ఆఫీసుల్లో పనిచేస్తున్నారని, వారందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికులందరికీ నేరుగా వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 46 వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో విజయవాడ ధర్నా పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. డిస్కం అధ్యక్షుడు జె. శ్రీనివాసరావు, ఎం.సురేష్‌, కె.శ్రీనివాసరాజు, పాండురంగరాజు, బోస్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

భీమవరం: ఉపాధ్యాయుల టెట్‌ పరీక్షకు సంబంధించిన సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం భీమవరం జిల్లా కలెక్టరేట్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వ హించే టెట్‌ పరీక్షకు సంబంధించి ఏవైనా ఫిర్యా దులు ఉంటే 93982 31218, 94919 69299, 83418 79098 నంబర్లలో సంప్రదించాలన్నారు.

చింతలపూడి: ఆంధ్రప్రదేశ్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో చింతలపూడికి చెందిన చిన్ని గోల్డ్‌ జిమ్‌ సభ్యుడు కె.ధనుష్‌ యాదవ్‌ ప్రతిభ చాటాడు. భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌లో 75 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రతిభతో ప్రతిష్టాత్మక ‘మిస్టర్‌ ఆంధ్ర’ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ కోచ్‌ కె. సాయికుమార్‌ మాట్లాడుతూ సరైన శిక్షణ, క్రమ శిక్షణ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చనడానికి ధనుష్‌ యాదవ్‌ ఒక నిదర్శనం అన్నారు. మిస్టర్‌ ఆంధ్ర టైటిల్‌ సాధించిన ధనుష్‌ యాదవ్‌ను పట్టణ ప్రము ఖులు, క్రీడాభిమానులు, యువత అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

కై కలూరు: కొల్లేరు చేపల సాగు ఎంతో ఆచరణాత్మకంగా ఉందని, రైతులే శాస్త్రవేత్తల మాదిరిగా ఆలోచించి సాగులో విజయాలు సాధిస్తున్నా రని ఒడిశా రాష్ట్ర ఉత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. ఒడిశా మత్స్యశాఖ అధికారి పార్థో ఆధ్వర్యంలో 22 మంది ఔత్సాహిక రైతులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ముందుగా దానగూడెంలో చేపల పట్టుబడిని పరిశీలించి సాగు పద్ధతులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కైకలూరులో ఆక్వా షాప్‌ను సందర్శించారు. అనంతరం సమీపంలోని కొల్లేరు ప్రాంత చెరువులను సందర్శించారు. కొర్రమీను, ఫంగస్‌, కట్టా, రూహు, మృగల చేపల రకాలను స్థాని కులు సందర్శకులకు వివరించారు. అక్కడి నుంచి చేపల ప్యాకింగ్‌ సెంటర్‌ను పరిశీలించి, కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారి సీహెచ్‌ గణపతిని కలిసి ల్యాబ్‌లో లభించే సేవలను అడిగి తెలుసుకున్నారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో క్రమేపీ వరద నీరు తగ్గుతూ వస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే నుంచి 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement