బంగారు పతక విజేతలు
● 4న వేడుకలు
● 2022–26 బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఎనిమిదో స్నాతకోత్సవం ఈనెల 4న నిర్వహించ నున్నట్టు అధికారులు తెలిపారు. 2022–26 బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.
2015లో ఏర్పాటు..
2015లో ఏపీ నిట్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సును ఎనిమిది బ్యా చ్‌లు పూర్తిచేసి 2022–26 బ్యాచ్‌గా 492 మంది బా లురు, 152 మంది బాలికలు సంస్థ నుంచి బయటకు వెళుతున్నారు. వీరితో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసిన 53 మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్ ప ట్టాలు అందుకోనున్నారు. సంస్థలో ఎనిమిది కో ర్సులు నిర్వహిస్తుండగా, ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కో విద్యార్థి చొప్పున ఎనిమిది మంది బ్యాచ్ వారీగా, అద్భుత ప్రతిభ కనపర్చిన ఒక విద్యార్థికి ఇనిస్టిట్యూట్ తరఫున బంగారు పతకాన్ని అందజేయనున్నారు.
అతిథులు వీరే.. ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వి.రమణరావు అధ్యక్షతన జరుగనున్న స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఐ ల్యాబ్స్ గ్రూప్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కలిదించి ఎన్.సత్యనారాయణ, నిట్ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి హాజరు కానున్నారు. ఏపీ నిట్ డీన్ అకడమిక్ డైరెక్టర్ ఎన్.జయరామ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
విభాగం పేరు పాయింట్లు
బయో టెక్నాలజీ ఊర్వశి పాల్ 8.78
కెమికల్ ఇంజనీరింగ్ ఖండాల చంద్రశేఖర్ 9.20
సివిల్ ఇంజనీరింగ్ ఉజ్వల పాండే 9.56
సీఎస్‌ఈ కలిదిండి శ్రీధర్‌వర్మ 9.53
ఈఈఈ విపుల్ యాదవ్ 9.53
ఈసీఇ సమయమంతుల అవ్యక్త 9.73
మెకానికల్ కొతూరు సుభాష్ 9.41
ఎంఎఐ తండుడి తేజామణిదీప్ 9.38
అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన సమయమంతుల అవ్యక్త ఇనిస్టిట్యూట్ తరఫున, కోర్సులో రెండు బంగారు పతకాలను అందుకోనున్నారు.


