భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మవారికి శనివారం పట్టణంతో పాటు ఇతర గ్రామాల నుంచి అమ్మవారి సేవలో పాల్గొనే మహిళా భక్తులు సుమారు 2 వేల మంది సారె సమర్పించారు. సుమారు వెయ్యి కిలోలకు పైగా మిఠాయిలు, పండ్లు సమర్పించినట్టు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. సుమారు 1500 మంది భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేసినట్టు చైర్మన్ బొండాడ నాగ భూషణం తెలిపారు. ఆలయంలో ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా సేవకులు మద్దాల విజయలక్ష్మి, కొప్పర్తి దేవిఆదిలక్ష్మికి దేవస్థానం తరఫున సత్కారం చేశారు. ధర్మకర్తలు పాల్గొన్నారు. – భీమవరం (ప్రకాశంచౌక్)


