క్యాంపు కార్యాలయాలకు స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

క్యాంపు కార్యాలయాలకు స్థల పరిశీలన

Aug 1 2026 1:13 AM | Updated on Aug 1 2026 1:13 AM

క్యాంపు కార్యాలయాలకు స్థల పరిశీలన పంటు రాకపోకలు నిలిపివేత కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు ఎన్‌సీసీ షూటింగ్‌ పోటీలు ముసాయిదా జాబితా ప్రచురణ పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు

ఉండి: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ క్యాంపు కార్యాలయాల కోసం భీమవరం ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అలాగే సివిల్‌ సప్లయీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌, గోడౌన్స్‌ లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను పరిశీలించారు. తహసీల్దార్‌ మంతెన రామప్రసాదరాజు, ఆర్‌ఐ ఆర్‌.కార్తీక్‌, మండల సర్వేయర్‌ రత్నవల్లి, వీఆర్వో గోవింద్‌ ఉన్నారు.

నరసాపురం: గోదావరిలో వరద నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో నరసాపురంలోని వశిష్ట రేవులో పంటు రాకపోకలు శుక్రవారం నుంచి అధికారులు నిలుపుదల చేశారు. ప్రవాహ ఉధృతి తగ్గిన తర్వాత అనుమతిస్తామని చెప్పారు.

నరసాపురం: గోదావరి వరద ఉధృతి, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో నరసాపురం డివిజన్‌లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు నరసాపురం ఆర్డీఓ దాసి రాజు తెలిపారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, నరసాపురం, యలమంచిలి, పెనుగొండ, ఆచంట తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాడేపల్లిగూడెం: స్థానిక శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆల్‌వింగ్‌ ఇంటర్‌ డైరెక్టరేట్‌ షూటింగ్‌ పోటీలు శుక్రవారం జరిగాయి. 9 గ్రూపుల నుంచి 108 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పా ల్గొన్నారు. ఫైరింగ్‌ క్యాంపును ఈనెల 7 వరకు నిర్వహించనున్నారు. కల్నల్‌ రితిన్‌మోహన్‌ అగర్వాల్‌, కమాండింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ పాండేలు పర్యవేక్షించారు. ఏపీ, తెలంగాణకు చెందిన క్యాడెట్లు హాజరయ్యారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సర్వేలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పో లింగ్‌స్టేషన్లలో, ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాల్లో, సహాయ ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో, జిల్లా ఎన్నికల అధికారి కా ర్యాలయంలో జాబితాను ప్రదర్శిస్తామన్నారు. జాబితాలో లోపాలుంటే సవరణ కోసం దరఖాస్తులను బీఎల్‌ఓలకు సమర్పించాలని సూచించారు.

బుట్టాయగూడెం: మండలంలోని పండుగూడెంలో లేగదూడపై పెద్దపులి శుక్రవారం దాడి చేసి హతమార్చింది. దీంతో మరింత అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర, పూనె నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. సీసీఎఫ్‌ ఆశాజ్యోతి, డీఎఫ్‌ఓ సందీప్‌రెడ్డి తదితరులు కండ్రికగూడెం సమీపంలో పులి సంచారాన్ని గుర్తించి, దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం కొండలు, గుట్టలతో కూడి ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో పులిని పట్టుకోవడం సవాలుగా మారిందని డీఎఫ్‌ఓ తెలిపారు. అయితే పులి మైదాన ప్రాంతంలోకి రాగానే మత్తుమందు (రసాయన పద్ధతి) ఇచ్చి సురక్షితంగా పట్టుకోవడానికి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండల నేషనల్‌ పార్క్‌ బృందాలు సిద్ధంగా ఉన్నా యని చెప్పారు. మైక్‌ ప్రచారం, డప్పు చాటింపుల ద్వారా పరిసర ప్రాంత ప్రజలను అప్రమ త్తం చేస్తున్నారు. కన్నాపురం, పోలవరం, కు క్కునూరు, జంగారెడ్డిగూడెం రేంజ్‌ అధికారులు పులి సంచారాన్ని ట్రాక్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement