భీమవరం (ప్రకాశంచౌక్): భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ కార్యక్రమానికి విజయనగరం జిల్లా నుంచి జనాన్ని తరలించడం కోసం పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు డిపోల నుంచి 100 ఆర్టీసీ బస్సులను శుక్రవారం విజయనగరం జిల్లాకు పంపించారు. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి 25 బస్సుల చొప్పున తరలించడంతో జిల్లాలో ప్రయాణికులకు బస్సుల కొరత ఎదురైంది. దీంతో బస్సుల కోసం రోడ్లపై, బస్టాండ్ల వద్ద గంటల తరబడి వేచి చూసే పరిస్థితి. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


