వినతులు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులు వెంటనే పరిష్కరించాలి

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

న్యూశాయంపేట: అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఒకరు, దారి ఇవ్వడం లేదని మరొకరు, అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఇంకొకరు.. ఇలా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు వినతులు ఇచ్చారు. అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ సత్యశారద వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖ 51, మున్సిపల్‌శాఖ 6, హౌసింగ్‌ 65, డీఆర్‌డీఓ 18, ఇతర శాఖలకు సంబంధించి 52 దరఖాస్తులు (మొత్తం 192) రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. అలాగే నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో 9 వినతులు వచ్చా యి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ నాగలక్ష్మి, డీఎంహెచ్‌ఓ ప్రకాష్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ప్రజావాణికి 192 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement