పాకాల చెరువు నీటిపై రభస | - | Sakshi
Sakshi News home page

పాకాల చెరువు నీటిపై రభస

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

ఖానాపురం: పాకాల చెరువు నీటిపై రభస నెలకొంది. నీటి లభ్యత, వర్షాభావ పరిస్థితులు, ఆరుతడి పంటల సాగుపై సోమవారం రైతువేదికలో ఆర్డీఓ ఉమారాణి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ స్వామి, ఈఈ సుదర్శన్‌రావు, తహసీల్దార్‌ రమేశ్‌, డీఈ రమేశ్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఈఈ సుదర్శన్‌రావు మాట్లాడుతూ పాకాలలో నీటి నిల్వ తక్కువగా ఉందని, గోదావరి జలాలు రావాలంటే సమయం పడుతుందని, ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించడానికి అవకాశం ఉందన్నారు. మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌లు మాట్లాడుతూ గతంలో తక్కువగా ఉన్నప్పటికీ నీరు ఇచ్చామని, ప్రస్తుతం రైతులంతా నీటి విడుదల చేయాలని కోరుతున్నారన్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఒకరిపైఒకరు దూషించుకున్నారు. ఇదే క్రమంలో రైతులంతా నీటిని అందించాలని చేతులు లేపి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయాలను ఆర్డీఓ ఉమారాణి నమోదు చేసుకున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు అధికారుల వద్దకు దూసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. రైతుల అభిప్రాయాలను ఎమ్మెల్యే, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ తెలిపారు. ఇదే సమయంలో అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. అధికారులు తీసుకు నే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ప్రతిపక్ష నా యకులు ఎమ్మెల్యే దొంతిపై బురదచల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ హరిబాబు, సొసైటీ చైర్మన్‌ వల్లె శ్రీనివాస్‌, ఆత్మ చైర్మన్‌ భిక్షంరెడ్డిలు విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం పాకాల ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఆగ్రహిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. నాయకులు ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, రామస్వామి నా యక్‌, వెంకటనర్సయ్య, సర్పంచ్‌లు వెంకన్న, రమేష్‌, వీరన్న, బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులను చుట్టుముట్టిన నేతలు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వాగ్వాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement