చిన్నారుల ‘సైన్స్‌’ పండుగ! | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల ‘సైన్స్‌’ పండుగ!

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

కాళోజీ సెంటర్‌: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానం, పరిశోధనా దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సు (నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌–ఎన్‌సీఎస్‌సీ) మొదలుకానుంది. వినూత్న ప్రయోగాలకు సంబంధించిన కార్యక్రమానికి జిల్లా అధికారులు నాంది పలికారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, గురుకులాలు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులను ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భాగస్వాములను చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ విద్యాసంవత్సరంలో శ్రీస్థిరమైన అభివృద్ధి కోసం శాస్త్రం, ఆవిష్కరణలుశ్రీ అనే అంశంపై ఆవిష్కరణలు రూపొందించాలన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఐదు ప్రధాన ఉప అంశాల్లో ఏదో ఒకదానిపై ప్రాజెక్టు రూపొందించాల్సి ఉంటుంది.

ఐదు ఉప ప్రధాన అంశాలు ఇవే..

● వ్యర్థాల నిర్వహణలో ఆర్‌5 విధానం (రెడ్యూస్‌, రీయూజ్‌, రిట్రీవ్‌, రీడిజైన్‌, రీసైకిల్‌)

● శక్తి వినియోగంలో ఈ4 విధానం (ఎక్స్‌ప్లోర్‌, ఎక్స్‌పర్మెంట్‌, ఎన్‌హ్యాంస్‌, ఎవాల్వ్‌)

● జల సంరక్షణలో నీటి సేకరణ, సంరక్షణ, పునర్వినియోగం

● ఆరోగ్య భారత్‌లో ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం

● భారతీయ జ్ఞాన వ్యవస్థలో సుస్థిర అభివృద్ధికి సాంప్రదాయ శాస్త్రాల అనువర్తనం

అర్హతలు, మార్గదర్శకాలు

6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. ప్రతీ ప్రాజెక్ట్‌కు ఇద్దరు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి, ఒక గైడ్‌ టీచర్‌ పర్యవేక్షణలో పనిచేయాలి. శాసీ్త్రయ పద్ధతి ప్రాజెక్టులు కేవలం ప్రదర్శన నమూనాలకే (మోడల్స్‌) పరిమితం కాకుండా, స్థానిక సమస్యలపై సర్వేలు, ప్రయోగాలు, కేస్‌ స్టడీలు, ప్రశ్నావళి, డేటా విశ్లేషణ ఆధారంగా రూపొందించాలి. ‘చేస్తూ నేర్చుకోవడం’ (లర్నింగ్‌ బై డూయింగ్‌) విద్యార్థులు స్వయంగా పరిశోధనలు చేసి ప్రాజెక్ట్‌ నివేదిక, లాగ్‌బుక్‌, ప్రదర్శన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.

ఎంపిక విధానం

జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి, అక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతాయి.

జూలై 30న చివరి తేదీ..

విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 30వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్‌ ఎన్‌సీఎస్‌ఈ.ఇన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. విద్యార్థులు పాల్గొనేలా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌, (98488 78455), ఎన్‌సీఎస్‌సీ కోఆర్డినేటర్‌ చల్లా కృష్ణారెడ్డి (99480 30445)ని సంప్రదించవచ్చు.

బాల శాస్త్రవేత్తలకు

సువర్ణావకాశం

మొదలుకానున్న జాతీయ బాలల విజ్ఞాన సదస్సు

ఈనెల 30న ముగియనున్న

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

భవిష్యత్‌ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు..

ఎన్‌సీఎస్‌సీతో విద్యార్థుల్లో శాసీ్త్ర య దృక్పధం, పరిశోధనా నైపుణ్యాలు, సృజనాత్మకత, పర్యావరణపై బాధ్యత, సామాజిక సమస్యల పరిష్కార సామర్థ్యం పెంపొందుతాయి. భవిష్యత్‌ శాస్త్రవేత్తలుగా ఎదగడానికి విద్యార్థులకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది. జిల్లాలోని అన్ని యాజమాన్య విద్యా సంస్థల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనేలా కృషిచేయాలి.

– బి.రంగయ్య నాయుడు, డీఈఓ

వచ్చే నెలలో జిల్లా స్థాయి ప్రాజెక్టులు

దేశంలోనే అత్యంత ప్రతి ష్టాత్మకమైన 32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సులో వి ద్యార్థులు పాల్గొనేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఈ ప్రాజెక్టుల ప్రదర్శన ఆగస్టులో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ఎన్ని ప్రాజెక్టులైన పాల్గొనవచ్చు. రాష్ట్రస్థ్ధాయికి ప్రతీ 14 ప్రాజెక్టుల నుంచి ఉత్తమ ప్రాజెక్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పంపిస్తాం.

– డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement