వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సూపరింటెండెంట్‌గా బాధ్యతల స్వీకరణ

మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026

అన్నదాతలకు శుభవార్త

అన్నదాతలకు ఎరువును సులభంగా అందించేందుకు వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవ కేంద్రాల్లోనూ బుకింగ్‌ చేసుకునేలా మార్పులు చేసింది.

కాశిబుగ్గ: వరంగల్‌ మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం) కు అధికారికంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్‌ (ఎఫ్‌ఏసీ) డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డికి పలు సమస్యలు సవాళ్లుగా మారనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ లేకుండానే ఆస్పత్రిని నెట్టుకొచ్చారు. చివరకు అదే ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌తో పాటు ఆర్థోపెడిక్‌ హెచ్‌ఓడీగా పనిచేసిన రాంకుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. డీఎంఈ నుంచి అధికారికంగా ఆర్డర్‌ వస్తే రెగ్యులర్‌ విధులు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన ఎఫ్‌ఏసీ హోదాలో చెక్‌ పవర్‌ రావడంతో ఆస్పత్రిలోని ఆర్థిక సమస్యలు తీరనున్నాయి.

పెండింగ్‌ బిల్లులపై దృష్టి పెట్టాలి

ఆస్ప్రతిలో చాలాకాలం నుంచి పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్‌, స్టేషనరీ, తదితర పెండింగ్‌ బిల్లులు మూలుగుతున్నట్లు సమాచారం. డ్రగ్స్‌కు సంబంధించిన కొందరు కాంట్రాక్టర్లు రెగ్యులర్‌గా దవాఖానా చుట్టూ తిరుగుతున్నారు. అలాగే స్టేషనరీ సంబంధించి రూ.కోటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. బిల్లులు చెల్లించకపోవడంతో ల్యాబ్‌, ఎక్స్‌రే పరీక్షలకు సంబంధించిన రిక్విజేషన్‌ ఫారాలు సరఫరా లేక తెల్ల కాగితాలపైనే వైద్యులు రాయాల్సి వచ్చింది.

భవనం ప్రారంభోత్సవంపై కసరత్తు...

నగరంలో 24 అంతస్తుల నూతన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దసరా నాటికి లేదా డిసెంబర్‌లో ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతున్నందున అందులో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎంజీఎంతో పాటు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీపై ప్రత్యేక దృష్టి సారించాలి.

డిప్యూటీ సూపరింటెండెంట్‌ను నియమించాలి

కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ బదిలీ అయిన నెల రోజుల దాటిన ఎవరిని నియమించలేదు. కేవలం అక్కడ ఉన్న ఏకై క ఆర్‌ఎంఓ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి సూపరింటెండెంట్‌ హోదాల్లో సూపర్‌కు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను నియమించే అధికారం ఉంది. అదేవిధంగా ఆస్పత్రిలో రెండు నెలలనుంచి సీటీ స్కాన్‌ యంత్రం పనిచేయకపోవడంతో పరీక్షలు ఆగిపోయాయి. వారంరోజులనుంచి రోగుల లిఫ్ట్‌ పనిచేయడం లేదు.

మరికొన్ని సమస్యలు ఇలా..

ఎంజీఎంలో పనిచేస్తున్న వందలాది మంది ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలల నుంచి వేతనాలు రావడం లేదు.

చాలాకాలం నుంచి ఉన్న సెంట్రల్‌ ల్యాబ్‌ను పూర్తిగా మూసేశారు. ఇక ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్‌ పేషంట్ల బ్లడ్‌ పరీక్షల కోసం గతంలో శ్యాంపిల్‌ టేకర్స్‌ ఉండేవారు. ప్రస్తుతం వారినే ఎందుకో తీసేశారు. వార్డుల్లోని పేషంట్లు వివిధ పరీక్షల కోసం ల్యాబ్‌ల వద్దకు రాకుండా చూడాలి.

ఆస్పత్రిలో ఉన్న పలు ఎక్స్‌రే మిషన్లు తరచూ రిపేర్‌కు గురవుతున్నాయి. డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్‌ సైతం పనిచేసిన సందర్భాల్లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ముఖ్యంగా క్యాజువాలిటీలో ఉన్న ఎక్స్‌రే మిషన్‌ వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలి.

ల్యాబ్‌ల్లో అన్ని రకాల పరీక్షలు జరిగే ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

ఇన్‌పేషంట్లకు డైట్‌ను సరఫరా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలి. డైటీషియన్‌ బదిలీ తర్వాత ఎవరినీ నియమించకపోవడంతో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది.

వైద్యులు లేకపోవడంతో డెంటల్‌ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి.

ఎంజీఎం సూపరింటెండెంట్‌ రాంకుమార్‌కు సవాలే..

ఆస్పత్రిలో పేరుకుపోయిన

పెండింగ్‌ బిల్లులు

ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందికి అందని వేతనాలు

రోగుల సత్వర వైద్య పరీక్షలకు ల్యాబ్‌ల ఏర్పాట్లు

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 24 అంతస్తుల వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

రేడియాలజీలో ఎక్స్‌రే మిషన్ల

మరమ్మతు, సదుపాయాలు

కాశిబుగ్గ: ఎట్టకేలకు వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ కాటం రాంకుమార్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంజీఎం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా (ఎఫ్‌ఎసీ) నియమిస్తూ రెండు రోజుల క్రితం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డికి ఆర్‌ఎంఓలు డాక్టర్‌ రఘురామయ్య, డాక్టర్‌ మధుకర్‌ యాదవ్‌, డాక్టర్‌ అశ్విని, ఏడీ బాలాజీ, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement