
ముమ్మరంగా రోడ్ల నిర్మాణ పనులు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట/నెక్కొండ: నియోజకవర్గంలో ముమ్మరంగా రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట, లింగగిరి, నెక్కొండ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నర్సంపేట మండల అధ్యక్షుడు సిద్ధన రమేశ్, జిల్లా కార్యదర్శి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్‌రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు బండి హరీశ్, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు రావుల హరీశ్‌రెడ్డి, పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ నెక్కొండ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్కి అశోక్, కుసుమ చెన్నకేశవులు, ఉపాధ్యక్షులు గరికపాటి హన్మంతరావు, పొలివెట్టి భానుప్రకాశ్, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.