
యూరియా కోసం బారులు
నర్సంపేట/ఖానాపురం: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. చెన్నారావుపేట సొసైటీకి యూరియా లారీ వస్తుందని తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల రైతులు శనివారం తెల్ల వారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులుదీరారు. 444 బస్తాల యూరియా రావడంతో ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున సొసైటీ సిబ్బంది పోలీస్ బందోబస్తు నడుమ పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. యూరియా బస్తాలు సరిపడా తెప్పించి ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఖానాపురం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు.