
విద్యార్థినులు లక్ష్యంతో చదవాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● జ్యోతిబాపూలే పాఠశాల
ఆకస్మిక సందర్శన
ఖానాపురం: విద్యార్థినులు లక్ష్యంతో చదవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని బుధరావుపేట శివారు ఐనపల్లిలోని మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలను శనివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి ఆటలా డిన అనంతరం కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుపై శ్రద్ధ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పల త, డీసీఓ సరిత, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్‌లు రమేశ్, రవిచంద్రారెడ్డి, వ్యవసాయ అధికారి బోగ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ జయశ్రీ పాల్గొన్నారు.