
ఒడంబడిక!
– సాక్షిప్రతినిధి, వరంగల్
అంతర్జాతీయ ప్రమాణాలు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా.. నూతన సాంకేతికతలో రాటుదేలాలన్నా.. సరికొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్నా.. జీవితంలో బాగా స్థిరపడాలన్నా విద్యార్థులకు కల్పతరువు నిట్ వరంగల్. ఇక్కడ సీటు వస్తే చాలు.. లైఫ్ సెట్ అనుకుంటారు. అలాంటి క్యాంపస్‌తో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు నిట్.. ఆఫ్‌లైన్‌లోనే కాదు.. వర్చువల్‌గా పరస్పర ఒప్పందాలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.
– కాజీపేట అర్బన్
నిట్ వరంగల్‌లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలతో పాటు పీహెచ్‌డీ విద్యను అభ్యసిస్తున్న సుమారు 6 వేల మంది విద్యార్థులకు ఇతర పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్‌షిప్, విద్యా పరస్పర బదిలీలకు, టెక్నాలజీ ఉపయోగానికి ల్యాబ్స్ సౌకర్యం, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎంఓయూలు తోడ్పాటునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు వివిధ సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం వీటి ద్వారా లభిస్తోంది. దీంతో పాటు ఇతర సంస్థలు, పరిశ్రమల్లో ఆవిష్కరణలకు, పరిశోధనలకు తోడ్పడుతున్నాయి.
103 నేరుగా.. 2 వర్చువల్‌గా
నిట్ వరంగల్‌తో జీడబ్ల్యూఎంసీ, భువనగిరి ఎయిమ్స్, సీఎస్‌ఆర్–ఐఐఎంటీ, ఐఐటీ గోవా, వీజేటీఐ ముంబాయి, నిట్ జమ్‌షెడ్‌పూర్, ఐఐఐటీడీఎం కర్నూల్, ఐఐఎం విశాఖపట్నం, ఐఐటీ జమ్మూ, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ హైదరాబాద్, నిట్ జైపూర్ మాలవ్య, టాటా కన్సల్టెన్సీ హైదరాబాద్, బెంగళూరు ఇన్ఫోసిస్, ది లక్ష్య ఫౌండేషన్ వరంగల్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్, స్వీడెన్ యూనివర్సిటీ ఆఫ్ మలార్‌డలాన్, హైదరాబాద్ టీఎస్‌కాస్ట్, ఇండియన్ రైల్వేస్, నోయిడాలోని ది మిస్‌టో టెక్స్‌తో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వర్చువల్‌గా థాయిలాండ్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో, జర్మనీలోని నోర్ధా హుస్సేన్ యూనివర్సిటీ ఆఫ్ ఆప్‌లైడ్ సైన్స్‌తో వర్చువల్‌గా ఎంఓయూ కుదుర్చుకుంది.
రాష్ట్రం, దేశంలోనే పలు సంస్థలతోనూ..
భువనగిరి ఎయిమ్స్‌లో ఆధునిక టెక్నాలజీని వైద్య రంగంలో ఉపయోగించేందుకు, కాజీపేట మండలం అయోధ్యపురంలో చేపట్టిన కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనుల్లో టెక్నాలజీ ఉపయోగానికి ఇండియన్ రైల్వేతో, మెరుగైన రోడ్ల నిర్మాణానికి న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో, పరిశ్రమల్లో పరిశోధనకు ఎన్‌ఐ– ఎంఎస్‌ఎంఈతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవే కాకుండా.. వరంగల్ ఎంజీఎంలోని మూగ, చెవిటి చిన్నారులకు తోడ్పడేందుకు ‘అమ్మ’ యాప్‌ను నిట్ వరంగల్ విద్యార్థులు స్టార్టప్‌గా రూపొందించారు.
ఎంఓయూలో ‘వరంగల్ నిట్’
కొత్త ధోరణి
అటు వర్చువల్‌గా, ఇటు నేరుగా
ఒప్పందాలు
సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉద్యోగవకాశాలకు తోడ్పాటు
ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, విస్తరించే దిశగా ప్రయత్నాలు
ప్రత్యేకతను చాటుకుంటున్న
సాంకేతిక సంస్థ
డ్యూయల్ డిగ్రీలకు అవకాశం
నిట్ వరంగల్‌తో థాయ్‌లాండ్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీలను అందజేసేందుకు వర్చువల్ ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ వరంగల్‌కు చెందిన 20 మంది విద్యార్థులు జియో ఇన్ఫామేటిక్స్‌లో రెండేళ్ల పాటు విద్యతోపాటు పరిశోధనలు చేపట్టనున్నారు. దీంతో నిట్ వరంగల్ నుంచి ఎంటెక్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థాయ్‌లాండ్ నుంచి మాస్టర్ డిగ్రీలు అందుకుంటారు.
ఏఐ పరిశోధనల కోసం..
నిట్ వరంగల్‌తో నోయిడాలోని మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో జాతీయ రహదారుల భద్రత, ప్రయాణికుల అనుభవాలపై, మెరుగైన రహదారుల నిర్మాణానికి పరిశోధనలను చేపట్టేందుకు ఎంఓయూ తోడ్పడనుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ తోడ్పడనుంది.
ఎంఓయూలతో అభివృద్ధి..
నిట్ వరంగల్‌లో నేరుగా ఆవశ్యకతను బట్టి వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో ఎంఓయూలను కుదుర్చుకుంటున్నాం. ఎంఓయూల ద్వారా నిట్ విద్యార్థులతో పాటు నిట్ వరంగల్ విద్యాసంస్థ అభివృద్ధి తోడ్పడుతున్నాయి. పరిశోధనలకు అనువుగా, ఆవిష్కరణలకు నెలవుగా ఉన్న నిట్ వరంగల్‌తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పరిశ్రమలతో ఉపాధి, విద్యాసంస్థలతో ఇంటర్న్‌షిప్‌లే కాకుండా పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు ఎంఓయూలు ఉపయోగపడతాయి. – బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్

ఒడంబడిక!

ఒడంబడిక!

ఒడంబడిక!