
నేలవాలిన పంటలు..
ఖానాపురం: పాకాల సరస్సు మత్తడి కారణంగా అశోక్‌నగర్ శివారులో కల్వర్టుపై నుంచి వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో నర్సంపేట–కొత్తగూడకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ, గంగారం మండలాలకు వెళ్లాల్సిన వారు భూపతిపేట మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. అశోక్‌నగర్ లోలెవల్ వద్ద ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. నాజీతండా శివారులో కల్వర్టుపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అశోక్‌నగర్ వద్ద సీఐ సాయిరమణ, తహసీల్దార్ రమేశ్, ఎస్సై రఘుపతి పర్యవేక్షిస్తున్నారు. కాగా, పాకాల ఆయకట్టు పరిధిలో వరి పంటలు నీటమునగగా.. నాజీతండా శివారులో పత్తిపంటలు జాలువారాయి.