
వరంగల్ డీఈఓను విధులనుంచి తొలగించాలి
విద్యారణ్యపురి: వరంగల్ డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్‌ను వెంటనే విధులనుంచి తొలగించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట, నర్సంపేట, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరిలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజను డీఈఓ జ్ఞానేశ్వర్ ఇటీవల దుర్బాషలాడారన్నారు. జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉపాధ్యాయుల ఫైళ్లను ఏజీ ఆఫీస్‌కు పంపకుండా డీఈఓ తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయ సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులను అవమానపర్చేలా ప్రవర్తిస్తున్న డీఈఓ జ్ఞానేశ్వర్‌ను విధులనుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలోని టీజీహెచ్‌ఎం అసోసియేషన్, పీఆర్‌టీయూ టీఎస్, టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్, టీపీయూఎస్, టీయూటీఎఫ్, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు
ఉపాధ్యాయ సంఘాల వినతి