
నేటినుంచి కాజీపేట దర్గా ఉర్సు
కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు కుల, మతాలకు అతీతంగా నేడు (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా శనివారం తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాజీపేట దర్గా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉర్సులో ప్రధాన ఘట్టాలు ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి గంధంతో ప్రారంభం, 22న ఉర్సు, 23న బదావా (ముగింపు) ఉంటుందని వివరించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర, దేశ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు వస్తారని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు.
– కాజీపేట రూరల్