
ఠాకూర్ ధరమ్‌సింగ్‌కు జాతీయ అవార్డు
హన్మకొండ: హనుమకొండకు చెందిన ఠాకూర్ ధరమ్‌సింగ్‌కు సేవా రంగంలో హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్–2025 జాతీ య అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినో త్సవం, ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఐకెన్ ఫౌండేషన్ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని ఎంపిక చేసి శుక్రవారం న్యూ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అ వార్డులు ప్రదానం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ బాగ్డోరియా చేతుల మీదుగా ధరమ్‌సింగ్ జాతీయ అవార్డు అందుకున్నారు. 53 సార్లు చేసిన రక్తదానాన్ని పరిగణనలోకి తీసుకుని సేవా రంగంలో ధరమ్ సింగ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
19నుంచి ఎంఏ తెలుగు
రెండో సెమిస్టర్ పరీక్షలు
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2024–25 విద్యా సంవత్సరానికిగాను రెగ్యులర్ ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 19వ తేదీనుంచి 25వ తేదీవరకు నిర్వహిస్తున్నామని జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 99894 17299, 99891 39136 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు.
వాలీబాల్, ఫుట్‌బాల్
ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం నిర్వహించిన వాలీబాల్, ఫుట్‌బాల్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్–15,17 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రతిభ చూపిన వాలీబాల్ జట్లు ఈ నెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో, ఫుట్‌బాల్ క్రీడాకారులు 21, 22వ తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, వాలీబాల్ సంఘం బాధ్యులు యాదిరెడ్డి, రాముడు, కోచ్ జీవన్, భూపాలపల్లి డీవైఎస్‌ఓ రఘు తదితరులు పాల్గొన్నారు.
మద్యం తాగి
వాహనం నడపొద్దు: సీపీ
వరంగల్ క్రైం: మద్యం తాగి వాహనం నడిపి చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శనివారం ఒక ప్రకటనలో వాహనదారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈనెల 9నుంచి వారం రోజుల్లో చేపట్టిన తనిఖీల్లో మొత్తం 324 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 16 మంది వాహనదారులకు కోర్టు రెండ్రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా వాహనదారులు రూ.3,95,400 జరిమానా చెల్లించారని వివరించారు. హనుమకొండ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో 121 కేసులకు,నలుగురికి జైలు, రూ.1,36,400 జరిమానా, కాజీపేట పరిధిలో 106 కేసుల్లో ఐదుగురికి జైలుశిక్ష పడగా, రూ.1,69,300 జరిమానా విధించినట్లు వివరించారు. అదేవిధంగా వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 97 కేసుల్లో ఐదుగురికి జైలుశిక్ష పడగా, మిగతా కేసుల్లో రూ.89,700 జరిమానా చెల్లించారని సీపీ తెలిపారు.
ప్రజలకు అందుబాటులో
ఉండాలి : రవీంద్రనాయక్
కాజీపేట అర్బన్ : ప్రజలకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్, డాక్టర్ రవీంద్రనాయక్ తెలిపారు. కాజీపేట మండలం రాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీలోని ల్యాబ్, ఫార్మసీ బ్లాక్‌లను పరిశీలించి మాట్లాడారు. వర్షాలకు ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగీ బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

ఠాకూర్ ధరమ్‌సింగ్‌కు జాతీయ అవార్డు

ఠాకూర్ ధరమ్‌సింగ్‌కు జాతీయ అవార్డు