
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నర్సంపేట రూరల్: వర్షాలతో రవాణా సౌకర్యానికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గర్భిణులను 102, 108 వాహనాల ద్వారా ఆస్పత్రులకు తీసుకురావాలని కలెక్టర్ సత్యశారద, వైద్యాధికారి సాంబశివరావు సూచించారు. కలెక్టర్ సత్యశారద, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు నర్సంపేట మండలంలోని అధికారులతో కలిసి రవాణా వ్యవస్థను పర్యవేక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణుల ప్రసవాలు సాధారణంగా జరగాలని, వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. వైద్యాధికారులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, వర్షాకాలంలో ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గీసుకొండ పీహెచ్‌సీ తనిఖీ
గీసుకొండ: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు శనివారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి మాట్లాడారు.