
వెడ్డింగ్ కలెక్షన్ ఫ్యాషన్ షో
నయీంనగర్: నయీంనగర్ ప్రెసిడెంట్ దాబాలో ఆదివారం వెడ్డింగ్ కలెక్షన్ ఫ్యాషన్ షో నిర్వహించారు. తెలంగాణ ఫ్యాషన్ కార్నివాల్ ప్రీ ఈవెంట్ గౌస్ స్టూడియో వరంగల్ మోడల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మోడల్ సెలెక్షన్ జ్యూరీగా వంశీ పాల్గొన్నారు. తెలంగాణ బ్రైడల్ ఫ్యాషన్ రన్‌వే షో నిర్వాహకుడు గౌస్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాషన్ షోలో ఆరుగురు డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు డిజైన్ చేసిన వెడ్డింగ్ థీమ్‌లను మోడల్స్ ప్రదర్శించారని తెలిపారు. ఈ ఫ్యాషన్ షోలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 50 మంది మోడల్స్ పాల్గొన్నట్లు తెలిపారు. సెలెక్ట్ అయిన మోడల్స్‌తో వెడ్డింగ్ కలెక్షన్ షోకేస్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ 14న ఉంటుందని, ఫైనల్ ఈవెంట్‌లో డిజైనర్ల సహకారంతో మోడల్స్ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో మోడల్స్, మేకప్ ఆర్టిస్టులు, యువతులు, ఔత్సాహికులు, ఫ్యాషన్ ప్రియులు పాల్గొన్నారు.
ప్రారంభించిన మాజీ ఎంపీ
పసునూరి దయాకర్
వివిధ జిల్లాల నుంచి హాజరైన
50 మంది మోడల్స్

వెడ్డింగ్ కలెక్షన్ ఫ్యాషన్ షో