
బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు అందాలి
న్యూశాయంపేట: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు అందా లని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. హనుమకొండ ములుగురోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్‌లో బీసీ ముస్లిం ఏ, బీ, ఈగ్రూప్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీన ర్ డాక్టర్ రాజ్‌మహ్మద్ అధ్యక్షతన ఆదివారం జరిగి న రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో ఇప్పటికీ బీసీ ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వరంగల్ నుంచి హక్కుల సాధన కోసం బీసీ ముస్లింల ఓ అడుగు ముందుకు పడడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యఅతిథిగా రావాల్సిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు ఫోన్‌లో తమ మద్దతు తెలిపారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ప్రొఫెసర్ వీరస్వామి, టీఎస్ మెసా తోఫఖుర్‌రహమా న్, అబ్దుల్ సుభాన్, ఖాలిద్ సయిద్, సిరాజ్ అ హ్మద్, అజీజ్‌పాషా, సర్వర్‌మొహినుద్దీన్, ముస్లిం ఉపకులాల ప్రముఖులు అబ్దుల్ ఆలమ్, సైదులు పాషా, యాకూబ్‌పాషా, రఫీ తదితరులున్నారు.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్
చైర్మన్ డాక్టర్ రియాజ్