
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌వి చిల్లర మాటలు
హన్మకొండ: బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అజ్ఞానపు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. ఆదివారం హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మేడిగడ్డ బరాజ్‌ను ఎవరో బాంబులతో పేల్చారు’ అని ఆర్‌ఎస్ ప్రవీణ్ మాట్లాడడం అవివేకం అన్నారు. కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనుల కారణంగా కూలిపోయింది తప్ప బాంబు పేలుళ్లతో కాదన్నారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆర్‌ఎస్ ప్రవీణ్ తస్మాత్ జాగ్రత్త! నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. అని కొండేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఒక్క చర్య తీసుకోకపోవడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందానికి నిదర్శనమన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంప్ర మధు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మార్టిన్ లూథర్, నాయకులు జన్ను మధు, ఎన్.శివకృష్ణ, వెంకటేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బరాజ్‌ను బాంబులతో
పేల్చారనడం అవివేకం
బీజేపీ ఎస్సీ మోర్చా
రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్