
వరంగల్ జిల్లా : వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో భర్తపై హత్యాయత్నం చేయించిన ఘటనలో భార్యతోపాటు ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని రామన్నపేట రఘునాథ్‌కాలనీ చెందిన గంగరబో యిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడేనికి చెందిన పోతుల సందీప్‌తో మూడు సంవత్సరాల క్రితం వరంగల్ బస్టాండ్ వ ద్ద పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సందీప్‌తో స్నే హం చేసేలా పద్మ తన భర్త రాజుతో అతడి వద్ద చిట్టీలు వేయించింది.
దీంతో సందీప్, రాజు మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో రాజు ఇంట్లో లేని సమయంలో సందీప్.. అతడి ఇంటికి తరచూ వస్తున్నాడు. దీనిపై అనుమానం వచ్చిన రాజు.. పద్మ ను, సందీప్‌ను ప్రశ్నించాడు. దీంతో రాజు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్ర మోద్, సబ్బీర్, స్వర్ణాకర్‌తో కలిసి పోతన డంపింగ్ యార్డు వద్ద రాజుపై దాడికి పాల్పడగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజును ఆస్పత్రికి తరలించగా ప్రా ణపాయస్థితి నుంచి బయటపడ్డాడు.
ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ..రాజుపై హత్యాయత్నం చేసి న సందీప్‌కు రూ. 3 లక్షలు అందజేసింది. రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదే రాత్రి ఇంటిలో ఉన్న మరో రూ. 6 లక్షలు తీసుకుని సందీప్‌తో వెళ్లిపోయింది. ఈ ఘటనపై రాజు కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు.. ఆదివారం మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ వద్ద సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గరు ప్రమోద్, సబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 5.40 లక్షల నగదు, ఓ కారు, రెండు స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలి పారు. సమావేశంలో ఎస్సైలు శ్రీనివాస్, సాంబ య్యలు, హెడ్‌కానిస్టేబుల్ రాజేందర్ పాల్గొన్నారు.