న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, వరంగల్: జిల్లాలో వాన మళ్లీ దంచికొట్టింది. ఐదు రోజుల క్రితం అతిభారీ వర్షంతో వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ వరద బురద నుంచి ఇంకా తేరుకోక ముందే జిల్లాలోని నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంతోపాటు ఇతర మండలాల్లో మోస్తరు వర్షం కురవడంతో చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు ఫీటు ఎత్తులో మత్తడి పోస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ నగరంలో కురిసిన సాధారణ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 8.30 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు 40 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
అలుగుపోస్తున్న గుండం చెరువు
దుగ్గొండి: భారీ వర్షానికి పలు గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. 14 పెద్ద చెరువులు, 90 కుంటలు మత్తడి పోస్తున్నాయి. మండలంలో అతి పెద్ద చెరువు తిమ్మంపేట గుండం చెరువు మత్తడి పోస్తోంది. ఈ చెరువు పరిధిలోని 400 ఎకరాల్లో రెండు పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిమ్మంపేట–నారాయణతండా ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో
భారీ వర్షం
జలకళ సంతరించుకున్న
చెరువులు, కుంటలు
అలుగు పోస్తున్న పాకాల సరస్సు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
జిల్లాలో సగటు వర్షపాతం
40 మిల్లీమీటర్లు
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన