పారిశుద్ధ్యంపై ముందడుగు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యంపై ముందడుగు

Sep 2 2025 3:47 PM | Updated on Sep 2 2025 3:47 PM

పారిశుద్ధ్యంపై ముందడుగు

పారిశుద్ధ్యంపై ముందడుగు

కొనుగోలుపై తాత్సారం 17 వాహనాల ద్వారా.. వారంలో ట్రాక్టర్‌లు

వనపర్తి టౌన్‌: స్థానిక మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణలో వేగం పెంచేందుకు పురపాలక శాఖ అడుగులేస్తుంది. పట్టణంతో పాటు నాలుగు విలీన గ్రామాలు ఉండడంతో మున్సిపాలిటీ పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రతి నివాసం, కమర్షియల్‌ దుకాణంలో చెత్తను సేకరించేందుకు మున్సిపాలిటీకి తలకుమించిన భారంగా మారింది. పట్టణంలో అధికారుల లెక్కల ప్రకారం నివాసాలు, కమర్షియల్‌ దుకాణాలు కలిపి 20వేలకు పైగా ఉ న్నాయి. దీంట్లో లెక్కకు రాని నివాసాలు సైతం అనే కంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త వాహనాలకు మొగ్గు

పురపాలికలో చెత్త సేకరణలో కలుగుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని మున్సిపల్‌ యంత్రాంగం నిర్ణయించారు. ఈ మేరకు సుమారు రూ.60.5 లక్షల అంచనాతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 3 ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 3 ఆటోలు కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందారు. ఈ మేరకు ఆటోలకు రూ. 27.50 లక్షలు, ట్రాక్టర్లు, ట్రాలీలకు రూ.33లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది నియామకం లేని కారణంగా అదనపు ఆటోలకు, ట్రాక్టర్లకు ఉన్న సిబ్బందిలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారికి డ్రైవర్‌ హోదా, జీతాన్ని ఇచ్చి కొత్త వాహనాలను నడిపించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఒకవేళ ఇలాగే ముందుకెళ్తే పారిశుద్ధ్య సిబ్బందిపై పనిభారం మరింత పెరగనుంది.

మూడు నెలల కిందట వాహనాల కొనుగోలుకు ఇంజినీరింగ్‌ విభాగం నుంచి ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు కార్యాచరణలో ముందడుగు పడటం లేదు. మున్సిపల్‌ డీఈ యునోస్‌ వీటి పురోగతిపై పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ ప్రభావం చెత్త సేకరణపై పడుతోంది. ఉన్నతాధికారులు సైతం ఈ అంశంపై దృష్టి సారించకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.

మున్సిపాలిటీ పరిధిలో 13 ట్రాక్టర్లు, 4 ఆటోలు కలిపి 17వాహనాల ద్వారా 50 మంది కార్మికులు చెత్త సేకరణ, దుర్గంధం ఎత్తిపోసే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా 10ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయి. ఈ మేరకు పట్టణంలో ప్రతి రోజు 20 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఏళ్ల కిందట ఉన్న సిబ్బంది, వాహనాలతోనే అన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ చేపడుతుండటంతో సకాలంలో ఇంటింటి చెత్త సేకరణ చేయలేకపోతుంది. ఈ క్రమంలో పుర పరిధిలోని నివాసాల్లో తడి, పొడి చెత్త పేరుకుపోతుండటంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒక్కో వార్డుల్లో ఐదారు వీధుల ఉండటంతో రోజుకు 2, 3 వార్డులు తిరగ్గానే సిబ్బంది సమయం ముగిసిపోతుంది. ఈ క్రమంలో ఒక్కొక్క వార్డులో ఇంటింటి చెత్త సేకరణకు వారానికి ఒకటి, రెండు సార్లే ట్రాక్టర్‌ వెళ్తుతుంది. దీనికి తోడు ప్రధాన, వరద కాల్వ, అంతర్గత రహదారుల డ్రెయినేజీల్లో పేరుకుపోయిన చెత్త, దుర్గంధాన్ని వెలికితీసి శివారు ప్రాంతాలకు తరలించేందుకు సైతం ఇంటింటి చెత్త సేకరణ ట్రాక్టర్లే వాడుతుండటంతో పుర పరిధిలో ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదనే అపవాదు ఉంది. ప్రధాన రాజకీయ పార్టీ ముఖ్య నాయకుల ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో చెత్త సేకరణ, దుర్గంధం తొలగింపు పనులు పూర్తి స్థాయిలో చేయట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిని అధిగమించేందుకు అధికార యంత్రాంగం శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

ఇంటింటి చెత్త సేకరణకు అనువుగా ట్రాక్టర్‌లను, ఆటోలను కొనుగోలుకు టెండర్‌లు పిలిచాం. వారం రోజుల్లో ట్రాక్టర్‌లు, ట్రాలీలు వస్తాయి. ఆటోలు తయారు అవుతున్నందున మరో 15 రోజులు పడుతుంది. టెండర్‌ దక్కించుకున్న వారు నాకు తెలిసిన వాళ్లు, బంధువులు కానే కాదు.

యునూస్‌, డీఈ వనపర్తి మున్సిపాలిటీ.

మున్సిపాలిటీలో కొత్తగా ఆటోలు, ట్రాక్టర్ల కొనుగోలుకు నిర్ణయం

జనాభాకు అనుగుణంగా పెరగనున్న చెత్త సేకరణ వాహనాలు

పుర ప్రజలకు తప్పనున్న అవస్థలు

సిబ్బంది పెరిగితే మరింత

మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ

టెండర్లు పూర్తయినా ఇంకా రాని వాహనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement