
బడుగుల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
వనపర్తి టౌన్: బడుగుల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్ అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో డీసీసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బడుగులు అభ్యున్నతి చెందాలనే రాహుల్‌గాంధీ లక్ష్యాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ద్వారా విద్యా, ఉద్యోగ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రెడ్డి, రాగివేణుగోపాల్, కురుమూర్తి, మన్యం, రాగి అక్ష య్, రాములు, జానకీరాములు, లక్ష్మయ్య, పెంటన్న పాల్గొన్నారు.