
కేజీబీవీల్లో వైద్యశిబిరాలు
ఖిల్లాఘనపురం: మండలంలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఎస్టీ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లతో పాటు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థులు విషజ్వరాల బారినపడి ఇంటిబాట పట్టారు. ఇందుకు సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హాస్టళ్లలో ఫీవర్రీ’ కథనానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. డీఎంహెచ్‌ఓ డా.శ్రీనివాసులు ఆదేశాల మేరకు సోమవారం రెండు కేజీబీవీల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లిష్ మీడియం కేజీబీవీలో అనారోగ్యంతో బాధపడుతున్న 50మంది విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి.. అవసరమైన మందులు అందజేసినట్లు మండల వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అదే విధంగా తెలుగు మీడియం కేజీబీవీలో ఆర్‌బీఎస్‌కే వైద్యులు స్వప్న, రఘు 60మంది విద్యార్థినులకు చికిత్స అందించారు. 30మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. వైద్యపరీక్షల అనంతరం విద్యార్థినులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫార్మసిస్టు శ్రీవిద్య, ఏఎన్‌ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీల్లో వైద్యశిబిరాలు