
హ్యాండ్‌బాల్ కోచ్‌నునియమించాలి..
ప్రధాన స్టేడియంలో 1997 నుంచి 2006 వరకు రవికుమార్ హ్యాండ్‌బాల్ కోచ్‌గా పనిచేసినప్పుడు ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అనంతరం నేను 2009 వరకు కోచ్‌గా పనిచేసి అనివార్య కారణాలతో మానేశాను. తర్వాత కోచ్ నియామకం చేపట్టలేదు. అయినా క్రీడపై ఉన్న ఆసక్తితో ఇప్పటికీ శిక్షణనిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత పద్ధతిన కోచ్‌ను నియమిస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు. – ఎండీ జియావుద్దీన్,
సీనియర్ హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు,
మహబూబ్‌నగర్
ప్రతిపాదనలు పంపించాం..
కోచ్‌ల నియామకంపై ఇదివరకే ప్రతిపాదనలు పంపించాం. నూతన క్రీ డాపాలసీతో ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరగనుంది. స్టేడియంలలో కోచ్‌ల నియామకం జరిగే అవకాశం ఉంది. క్రీడా శిక్షణతో నైపుణ్యంగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. గ్రామీణస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసుకోవచ్చు.
– ఎస్.శ్రీనివాస్,
డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్
●

హ్యాండ్‌బాల్ కోచ్‌నునియమించాలి..