జై జై గణేశా.. | - | Sakshi
Sakshi News home page

జై జై గణేశా..

Aug 27 2025 9:53 AM | Updated on Aug 27 2025 9:53 AM

జై జై

జై జై గణేశా..

న్యూస్‌రీల్‌

నేటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు

వాడవాడలా ముస్తాబైన మండపాలు

గ్రామాలకు తరలుతున్న లంబోదరుడు

సందడిగా మారిన పూజాసామగ్రి దుకాణాలు

బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025

–10లో u

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

వనపర్తి రూరల్‌: సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో జరిగిన ప్రసవాలు, సిబ్బంది పనితీరు, మందుల నిల్వ, ఓపీ రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున గ్రామాల్లో శానిటేషన్‌, క్లోరినేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని.. సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. డీఎంహెచ్‌ఓ వెంట డా.చంద్రశేఖర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌, సిబ్బంది రాజేశ్‌గౌడ్‌, కృష్ణ, విజయలక్ష్మి, కుమారి, రాజు ఉన్నారు.

జెన్‌కోలో ముగిసిన

రాష్ట్రస్థాయి క్రీడలు

ఆత్మకూర్‌: ఎగువ జూరాల జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జెన్‌కో రాష్ట్రస్థాయి క్యారం, చెస్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. క్యారమ్స్‌లో మొదటి బహుమతిని యాదాద్రి జట్టు కై వసం చేసుకోగా, చెస్‌లో కాకతీయ థర్మల్‌ కేంద్రం జట్టు కై వసం చేసుకుంది. విజేతలకు జెన్‌కో ఎస్‌ఈలు శ్రీధర్‌, సురేష్‌ బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో కొత్తగూడెం తర్మల్‌ కేంద్రం, శ్రీశైలం, జూరాల, భద్రాద్రి, విద్యుత్‌సౌథ, యాదాద్రి, పులిచింతల, కాకతీయ ప్రాజెక్టులకు చెందిన 60 మంది ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

పథకాల పేరుతో కాంగ్రెస్‌ మోసం

వనపర్తిటౌన్‌: పథకాల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లు పెంచాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వృద్ధాప్య పింఛన్‌ రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్‌ రూ. 6వేలకు పెంచాలని, యూత్‌ డిక్లరేషన్‌ ప్రకారం రూ. 4,016 నిరుద్యోగ భృత్తి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నాయకులు శ్రీశైలం, వెంకటేశ్వర్‌రెడ్డి, సీతారాములు, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్‌రెడ్డి, పెద్ది రాజు, శ్రీనివాస్‌గౌడ్‌, వారణాసి కల్పన, బాబురావు, మురారి నాయక్‌, సరోజ పాల్గొన్నారు.

పోలీసుల సూచనలు పాటించాలి : ఎస్పీ

గణేశ్‌ ఉత్సవ కమిటీల సభ్యులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేశ్‌ మండపాలను విద్యుత్‌ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల్లో ఈఎల్‌సీబీ, అవసరమైన చోట ఎంసీబీఎస్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి వైరింగ్‌ను లైసెన్స్‌ పొందిన ఎలక్ట్రీషన్‌తోనే చేయించుకోవాలని తెలిపారు. వైరింగ్‌లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నారు. సర్వీస్‌ కేబుల్స్‌ హుకింగ్‌ చేయరాదన్నారు. వైర్లు నేలపై వేయరాదని.. సరైన ఎర్తింగ్‌తో 3 పిన్‌ ప్లగ్‌లు ఉపయోగించాలని సూచించారు. మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే.. వాటిని తప్పక ఇన్సులేషన్‌ పదార్థంతో కవర్‌ చేయాలన్నారు. సర్వీస్‌ వైరు విద్యుత్‌ స్తంభానికి అమర్చిన తర్వాత సంబంధిత లైన్‌మేన్‌ లేదా జేఎల్‌ఎం అనుమతి లేకుండా మార్పులు చేయరాదన్నారు. ఇన్వర్టర్‌ లేదా జనరేటర్‌ వాడితే రిటర్న్‌ కరెంట్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వనపర్తిటౌన్‌: విఘ్నేశ్వరుడి పూజకు వేళైంది. వాడవాడలా లంబోదరుడిని కొలువుదీర్చేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని బుధవారం గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఇప్పటికే మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి వినాయక మండపం నుంచి 20–60 అడుగుల వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలో గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ కళాశాల ముఖద్వారం వద్ద గణేశ్‌ మండపాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అదే విధంగా చింతల హనుమాన్‌, కన్యకా పరమేశ్వరి, రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రతి ఏటా ప్రతిష్ఠించే గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టీచర్స్‌ కాలనీ, వెంగళ్‌రావునగర్‌, శాంతినగర్‌, పీర్లగుట్ట, బ్రాహ్మణవీధి, బ్రహ్మంగారి వీధి, పాతబజార్‌, జమ్మిచెట్టు, 40 ఫీట్ల రోడ్డు, రాంనగర్‌, చందాపూర్‌ రోడ్డు, వల్లబ్‌నగర్‌, బండారునగర్‌, శ్వేతానగర్‌, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో 3–4 గణనాథులను కొలువుదీర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలను నిర్వాహకుల అనుకూలత మేరకు ఉదయం నుంచి రాత్రి పది గంటలలోగా పూర్తిచేస్తారు.

మార్కెట్‌ కిటకిట

వినాయక చవితి సందర్భంగా మంగళవారం మార్కెట్‌ కిటకిటలాడింది. వినాయకుడి పూజకు అవసరమైన సామగ్రి, పూలు, పండ్ల కొనుగోలుతో పాటు అలంకరణ వస్తువుల కోసం ఉత్సవ కమిటీల సభ్యులు సంబంధిత దుకాణాలకు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. లంబోధరుడు కొలువుదీరేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో స్టేజ్‌ నిర్మాణం, మండపాల అలంకరణ తదితర ఏర్పాట్లలో నిర్వాహకులు తలమునకలయ్యారు.

జిల్లా కేంద్రంలోని గ్రీన్‌ పార్కులో సుందరంగా ముస్తాబైన

గణనాథుడి మండపం

మట్టి గణపతులతో

పర్యావరణాన్ని కాపాడుదాం

వనపర్తి: పర్యావరణ హితమై ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో కాకుండా మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలతో నీరు కాలుష్యమై పర్యావరణానికి హాని కలిగిస్తుందన్నారు. మట్టి విగ్రహాలను నెలకొల్పి పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారవుతారన్నారు. బీసీ సంక్షేమశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు 2వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యాదయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఏఈఎస్‌ సురేశ్‌, ఏఓ భానుప్రకాశ్‌, బీసీ సంక్షేమశాఖ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

వేకువజామున

5గంటలకే క్యూ..

యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. మంగళవారం అమరచింతలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు వేకువజామున 5 గంటల నుంచే క్యూ కట్టారు. మస్తీపురం, పాంరెడ్డిపల్లె,

అమరచింత గ్రామాలకు చెందిన రైతులు రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. సాయంత్రం వరకు 300 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశారు.

– అమరచింత

జై జై గణేశా.. 1
1/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 2
2/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 3
3/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 4
4/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 5
5/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 6
6/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 7
7/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 8
8/9

జై జై గణేశా..

జై జై గణేశా.. 9
9/9

జై జై గణేశా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement