
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
వనపర్తిటౌన్: బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్య నేరమని.. నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహం జరిగిన రెండేళ్లలోపు రద్దు చేసుకునేందుకు జిల్లా న్యాయస్థానంలో పిటీషన్ వేసుకోవచ్చని సూచించారు. మోటారు వెహికల్, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రఘు, సూర్యనారాయణ, పాఠశాల అధ్యక్షుడు మందడి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.